INFINIX GT30 PRO: మిడ్ రేంజ్ ధరలో..ది బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ "ఇన్ఫినిక్స్ GT 30 ప్రో" 9 month ago
ఇన్ఫినిక్స్ కంపెనీ తమ కొత్త స్మార్ట్ ఫోన్ అయిన "INFINX GT30 PRO"ని లాంచ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ ఫోన్ ప్రత్యేకంగా గేమర్లను ఆకర్షించడానికి రూపొందించబడిందని కంపెనీ తెలిపింది. గేమర్లకు తగ్గట్టుగా అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్, అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, మెరుగైన VC కూలింగ్ సిస్టమ్, షోల్డర్ ట్రిగ్గర్స్, XBoost గేమింగ్ ఇంజిన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇన్ఫినిక్స్ కంపెనీ తన సరికొత్త గేమింగ్ ఫోన్ Infinix GT 30 Pro జూన్ 3న భారతదేశంలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి.!
INFINX GT30 PRO ఫీచర్స్ :
ప్రాసెసర్: MediaTek Dimensity 8350
డిస్‌ప్లే: 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే
రిఫ్రెష్ రేట్:144HZ
పీక్ బ్రైట్నెస్: 1100 nits
బ్యాటరీ: 5500mAh
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్-15 ఆధారిత XOS 15
బ్యాక్ కెమెరా:
*108MP ప్రైమరీ కెమెరా
*8MP అల్ట్రా-వైడ్ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 13 MP
ఛార్జింగ్:
*45W ఫాస్ట్ ఛార్జింగ్
*30W వైర్‌లెస్ ఛార్జింగ్
*10W వైర్డు
*5W వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్
కాన్ఫిగరేషన్:
8GB RAM + 256GB స్టోరేజ్
12GB RAM + 256GB స్టోరేజ్
12GB RAM + 512GB స్టోరేజ్
కనెక్టివిటీ ఫీచర్లు:
*5G, Wi-Fi 6
*బ్లూటూత్ 5.4
*NFC
*GPS (NavIC తో)
*USB టైప్-C
కలర్ ఆప్షన్స్:
*బ్లేడ్ వైట్
*డార్క్ ఫ్లేర్
*షాడో యాష్
సెన్సార్లు: ఫింగర్ ప్రింట్ సెన్సర్ (ఇన్-డిస్‌ప్లే ), యాక్సిలెరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ మరియు గేమింగ్‌కు కీలకమైన సిక్స్-యాక్సిస్ గైరో సెన్సార్లు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
*Dimensity 8350 Ultimate ప్రాసెసర్ చిప్‌సెట్
*AI-బ్యాక్డ్ VC కూలింగ్ సిస్టమ్
*30W వైర్‌లెస్ ఛార్జింగ్ & రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్
*డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్
*JBL టూనేడ్ స్టీరియో స్పీకర్లు
మైనస్ పాయింట్స్ :
*3.5mm హెడ్‌ఫోన్ జాక్ లేదు
*మైక్రో SD కార్డ్ స్లాట్ లేదు
*తక్కువ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు
ఇన్ఫినిక్స్ ఈ స్మార్ట్ ఫోన్ ను ముఖ్యంగా గేమింగ్ పరంగా.. యూజర్స్ కు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు ఈ స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టింది. ధర విషయానికి వస్తే.. సుమారు రూ.25 వేల నుండి ఈ ఫోన్ అమ్మకానికి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మరియు Infinix ఇండియా వెబ్‌సైట్‌లో కొనుగోలుకు రానుంది. మిడ్ రేంజ్ ధరలో.. బెస్ట్ గేమింగ్ ఫోన్ కోరుకునే వారికీ ఇది చాలా మంచి ఎంపిక.